విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదు - జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్

పాడేరు, ఆగష్టు 12 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఐసిడిఎస్, వైద్యా ఆరోగ్య శాఖల పురోగతి పై కలెక్టరేట్ నుండి మంగళవారం వీడికాన్ఫరెస్సు ద్వారా సమీక్షించారు. మండలాల వారీగా పనితీరుపై ఆరా తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, సమస్యత్మక అంగన్వాడీలపై దృష్టి సారించాలని, అంగన్వాడీల్లో డేటా ఎంట్రీ తప్పులు, దిద్దుబాట్లు లేకుండా ఎంట్రీ వేగవంతం చేయాలన్నారు. ఎంపిడిఓలు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, సచివాలయాలు, అంగన్వాడీలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రతి నెలా సమస్యత్మక అంగన్వాడీలు సందర్శించి డేటా అందజేయాలన్నారు. 
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్స్ తో సమీక్షించి పనులపై,  లో బర్త్ వెయిట్ పై ఆరాతీశారు. వెయిట్ తక్కువ ఉన్న వారికి వెయిట్ పెంచడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారో ఆరాతీశారు. లో బర్త్ వెయిట్ ఉన్న పిల్లల డేటా అప్డేట్గా ఉండాలన్నారు. అనంతగిరిలో చిన్నారి మరణంపై  ఎంపిడిఓ ఎంక్వయిరీ చేసి నివేదిక అందజేయాలన్నారు. మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ, ఎఎన్ఎమ్ లు, ఆశా అందుబాటులో ఉన్నా ఇలా జరగడం సరికాదని, ఇటువంటివి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు గర్భిణీలు, పిల్లలు వచ్చేలా ఎఎన్ఎమ్ లు, ఆశా వక్కర్స్ చూడాలన్నారు. ఇమ్మ్యూనైజేషన్ నిర్వహణపై మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ ఉండాలన్నారు. స్కూల్ హెల్త్ నిర్వహణపై సమీక్షించి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలన్నారు.  జిల్లాలో  జ్వరాలతో సంభవించిన మరణాలపై సమీక్షించగా జిల్లా మలేరియా అధికారి వివరించారు. 

సమావేశంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అన్ని సచివాలయాలలో బంగారు కుటుంబాలలో అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి వారిని మార్గదర్శులు దత్తత తీసుకోనేట్లు కార్యాచరణ చేపట్టాలి. ఈ కార్యక్రమంలో ఎవరికీ ఏ విధమైన ఒత్తిడి లేదు.
- పి4 నీడ్ అసెస్మెంట్ సర్వే నూటికి నూరు శాతం తొందరగా పూర్తి చేయాలి. అందరూ ఎంపిడిఓ లకు మార్గదర్శిల జాబితా, బంగారు కుటుంబాలు జాబితా లను తెలియజేయమని సిపిఓని ఆదేశించారు.

ఈ సమావేశంలో  రంపచోడవరం ఐటిడి ఏపిఓ కె. సింహచలం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి ఝాన్సీ రామ్ పడాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. టి.విశ్వేశ్వర నాయుడు, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎంవిఎస్ లోకేశ్వర రావు, సిపిఓ పి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments