సేవకు ప్రతి రూపం - నీలం శివ గంగాధర

సేవకు ప్రతిరూపం – నీలం శివ గంగాధర
15 ఏళ్లుగా ‘ఓం నమశ్శివాయ సేవ కళా సమితి’తో స్ఫూర్తిదాయక కార్యక్రమాలు
కడప జిల్లా, వీరపునాయునిపల్లె ఆగష్టు 10(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): సాయం ఎంత చిన్నదైనా… అది అందించే మనిషిని భగవంతుని ప్రతిరూపంగా నిలుపుతుంది. చేయూత పొందిన వారి హృదయంలో ఆ సాయం శాశ్వతంగా ముద్రవేసి, మానవత్వాన్ని పరమ స్థాయికి తీసుకెళ్తుంది. అనాధలు, అభాగ్యులు, అండలేని వారు… వీరికి అండగా నిలబడడం దైవ సేవకు సమానం. ప్రతిఫలం ఆశించకుండా, పరోపకారమే జీవన ధ్యేయంగా చూసే వారు ఈ రోజుల్లో అరుదు. అలాంటి మహనీయులను వేళ్లపై లెక్కపెట్టగలిగేంత తక్కువ మంది మాత్రమే ఉన్నారు. “నేనెవరు? నేనేమిటి?” అనే ఆత్మపరిశీలన నుంచి సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పం పుడుతుంది. అది ఒకసారి పుడితే… ఆ మార్గంలో తిరుగు ఉండదు. జీవితపు చివరలో సమాజం గురించి ఆలోచించడం కంటే, జీవిత ఆరంభంలోనే ఆ తత్వాన్ని స్వీకరించడం గొప్పది. అలాంటి అసాధారణ ఆలోచనతో… గత 20 ఏళ్లుగా సమాజ సేవనే శ్వాసగా మార్చుకున్న యువకుడు నీలం శివ గంగాధర. కడప జిల్లా, వీరపునాయునిపల్లె గ్రామంలో నీలం చిన్నగంగన్న, అంకాలమ్మ పుణ్య దంపతులకు జన్మించిన శివ గంగాధర… చిన్న వయసులోనే పరోపకారం పట్ల మక్కువ పెంచుకున్నారు. స్నేహితులతో కలిసి ‘ఓం నమశ్శివాయ సేవ కళా సమితి’ని స్థాపించి, దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనాధలకు భోజనం అందించడం నుంచి, పేద విద్యార్థులకు పాఠశాల సామగ్రి, వృద్ధులకు వైద్య సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు… ఇలాంటివి ఎన్నో. ఆయన ప్రేరణ – పార్వతి పరమేశ్వరులు. ఆ భక్తి, ఆ తపనే ఆయనను సమాజ సేవ మార్గంలో దూసుకుపోయేలా చేసింది. ఈ రోజు, ఆయన పుట్టినరోజు సందర్భంగా… నీలం శివ గంగాధర చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, “సేవలోనే జీవితం” అనే ఆయన నమ్మకాన్ని స్పూర్తిగా తీసుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుదాం. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఉన్న ఆయన మిత్రులు, అభిమానులు పలువురు పత్రికా ముఖంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. 

Post a Comment

0 Comments