ఆదివాసి నిరుద్యోగుల మహా ధర్నా - అర్థనగ్న ప్రదర్శన, భారీగా హాజరైన నిరుద్యోగులు

ఆదివాసీ నిరుద్యోగుల మహాధర్నా 

భారీగా హాజరైనా నిరుద్యోగులు
ఆదివాసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన

అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 8 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): 

ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుండి ముఖ్యంగా దూర ప్రాంత మండలాల నుండి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జోరు వానను కూడా లెక్కచేయకుండా నిరుద్యోగులు ధర్నాలో పాల్గొనడం గమనార్హం. తమ హక్కుల సాధన కోసం పలువురు గిరిజన నాయకులు అర్ధనగ్నంగా ప్రదర్శనలు నిర్వహిస్తూ రద్దయిన జీవో నెంబర్ 3కు బదులుగా ప్రత్యామ్నాయ జీవోను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రాబోయే మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాడేరు పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన తమ హామీ ప్రకారం తగిన జీవోను ప్రకటిస్తారని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. ఈ మహాధర్నా పాడేరు ఐటీడీఏ పరిసర ప్రాంతాలను దద్దరిల్లేలా చేసింది. గిరిజనులు తమ సమస్యలను తీవ్రంగా వ్యక్తపరుస్తూ తమ ఉద్యోగ హక్కులను సాధించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని ఆదివాసీ నిరుద్యోగుల సంఘం నాయకులు తెలిపారు.భారీగా హాజరైన నిరుద్యోగులు

Post a Comment

0 Comments