కొత్తపాలెం పంచాయతీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు - చింతపల్లి ఎంపీపీ అనూష దేవి, జడ్పిటిసి బాలయ్య

కొత్త పాలెం పంచాయతీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఎంపీపీ అనూష దేవి, జడ్పిటిసి బాలయ్య

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 12 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): కొత్త పాలెం పంచాయతీ పరిధిలోని బురిసింగి, మామిడిపల్లి గ్రామాలలో స్థానిక సర్పంచ్ వనగల సోమరత్నంతో కలిసి పది లక్షల రూపాయల జెడ్పీటీసీ నిధులతో సిసి డ్రైనేజీ పనులకు చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూష దేవి, జడ్పిటిసి పోతురాజు బాలయ్యలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా జెడ్పీ, మండల పరిషత్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా, మండలంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి 40కి పైగా మంచి నీటి బోర్లు వేయించామన్నారు. అదేవిధంగా, సిసి రోడ్లు, సిసి డ్రైన్‌లు వంటి ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు. అంతేకాకుండా, పార్లమెంటు సభ్యులతో మాట్లాడి చింతపల్లిలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయించి, పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. మండలంలోని ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను గౌరవ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజ రాణికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఆమె సానుకూలంగా స్పందించి, తన నిధులతో ఆర్ఓ ప్లాంట్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జల్లేపల్లి సుభద్రమ్మ, పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజ రాణికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శారద, వైస్ సర్పంచ్ పాంగి మోహన్ రావు, జేఈ స్వర్ణలత, వైసిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, వార్డు సభ్యులు భీమరాజు, సచివాలయం సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments