పాడేరు ఆగస్టు 15 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు గౌరవ వందనం చేసారు. పోలీసులు, విద్యార్దుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రసంగించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను కలసి సాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేసారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల అలరించాయి. ప్రదర్శనలో గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్ధులకు ప్రధమ బహుమతి, పాడేరు కెజిబివి పాఠశాల ద్వితీయ బహుమతి లోచలిపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్ధులు తృ తీయ బహుమతిని సొంతం చేసుకున్నారు. హుకుంపేట కెజిబివి పాఠశాల, తలారిసింగి బాలుర ఆశ్రమ పాఠశాల, పాడేరు కెజిబివి పాఠశాల శ్రీనృత్యాంజలి మ్యూజిక్ మరియు డ్యాన్స్ అకాడమీ విద్యార్ధులు సాంస్కృ తిక ప్రదర్శనలు చేసారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై వివిద ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయ మరియు ఉద్యాన శకటానికి మొదటిస్థానం, గృహనిర్మాణ శాఖ, ఎపి ఇపిడిసి ఎల్ శకటాలకు ద్వితీయ స్థానం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటానికి తృతీయ స్థానంలో నిలిచాయి.
ఆసక్తికరంగా ఏర్పాటు చేసిన స్టాల్స్
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. అటవీ శాఖ ప్రధమ స్థానంలో, కాఫీ బోర్డు ద్వితీయ స్థానం, డి ఆర్ డి ఏ వెలుగు స్టాల్ కు తృ తీయ స్థానం లభించింది. వేడుకలలో 10 శాఖలు స్టాల్స్ ను ఏర్పాటు చేసాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ, గంజాయి నిర్యూలనపై పోలీస్, ఐసిడి ఎస్, సెరీకల్చర్, జిసిసి, విడివికె, డి ఆర్ డి ఏ, జిల్లా సర్వజన ఆసుపత్రి, కాఫీ బోర్డు, అటవీ శాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేసాయి.
మార్చ్ ఫాస్టలో తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రధమ స్థానం హకుంపేట కెజిబివి పాఠశాల విద్యార్ధులు ద్వితీయ, పాడేరు ఇంగ్లీషు మీడియ పాఠశాల విద్యార్థులు తృ తీయ స్థానాల్లో నిలిచారు. పోలీసు జాగిలాల ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఎంజె అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డి. ఎస్ ఓ సందీప్ రెడ్డి, డి ఆర్ ఓ కె.పద్మలత, ఎన్డీని ఎం.వి. లోకేష్ కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments