వరుస వర్షాలతో పొలంలో దుక్కు దున్నిన వైకాపా సీనియర్ నేత, రైతు మోరి రవి
అల్లూరి జిల్లా, చింతపల్లి, ఆగస్టు 6 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : నాట్లకు సిద్ధమవుతున్న తరుణంలో కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ, రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి పొలం పనులకు శ్రీకారం చుట్టారు వై.కా.పా సీనియర్ నాయకులు మోరి రవి. చురుకైన రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితమైన మోరి రవి, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం రైతు బిడ్డగానే కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో వై.కా.పా. బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మోరి రవి, ఖాళీ సమయాల్లో తన వ్యవసాయ క్షేత్రంలో కష్టపడటానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ ఏడాది కురుస్తున్న మంచి వర్షాలకు పొలం పనులు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో, బయలు కించంగి గ్రామంలోని తన పొలంలో మినీ ట్రాక్టర్‌తో స్వయంగా దుక్కి దున్ని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజకీయ నాయకుడైనా, ప్రజా సేవకుడైనా, అంతిమంగా తాను ఈ నేల బిడ్డనే అని ఆయన చేతల ద్వారా నిరూపించారు. సామాన్యుడిలా పొలంలో కష్టపడుతూ, ఇతర రైతులకు స్ఫూర్తినిచ్చారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు, తమ వంతుగా శ్రమిస్తూ, వ్యవసాయానికి అండగా నిలవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, "నాయకుడిగా, కార్యకర్తగా ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, రైతుగా మన భూమిని నమ్ముకుని జీవించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ వర్షాలు రైతులకు కొత్త ఆశలు చిగురింపజేశాయని, అన్నం పెట్టే రైతు బాగుంటేనే, సమాజం బాగుంటుంది," అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆ పథకాలను రైతుల వద్దకు తీసుకెళ్లడమే కాకుండా, నేను కూడా పొలంలో కష్టపడటం నాకు ఆనందంగా ఉందనీ, ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని గౌరవించాలి, రైతులను ఆదరించాలి," అని పేర్కొన్నారు. ఆయన చేసిన పనిని చూసి గ్రామస్థులు, తోటి రైతులు హర్షం వ్యక్తం చేశారు.
0 Comments