పనితీరే ప్రశంసలకు ప్రామాణికం
ఉత్తమ సేవలకు 16 అవార్డులు
పాడేరు ఆగస్టు 15(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : పనిచేసేది ఎక్కడైనా ప్రశంసలు పొందడం ఆయనకు నిత్యకృత్యం. విధి నిర్వహణలో అంకిత భావం, పనితీరులో కచ్చితత్వం ఆయనకు అధికారుల మన్ననలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో స్వతంత్ర, గణతంత్ర దినో త్సవ వేడుకల్లో తరచుగా ఆయనకు ప్రశంసాపత్రాలు లభిస్తుండడం రివాజుగా మారింది. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డివిజనల్ పౌర సంబంధాల శాఖ అధి కారిగా ఐటిడిఏ ప్రత్యేక ప్రచార విభాగం సహాయ ప్రాజెక్టు అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పండు రాములు 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో సహాయ పౌర సంబంధాల శాఖ అధికా రిగా పనిచేస్తున్న రాములు పనితీరును మెచ్చిన ప్రాజెక్టు అధికారి ప్రత్యేకంగా ఐ.టి.డి.ఎ. కార్యాలయానికి డిప్యూటేషన్ పై నియమించుకున్నారు. దీంతో ఐదు సంవత్సరాలు ఆయన ఐ.టి.డి.ఎ. కార్యాలయంలోనే సేవలు అందిస్తూ మధ్య మధ్యలో కొంతకాలం పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పౌర సంబధాల శాఖ అధి కారిగా పనిచేసారు.
రాములు ఎక్కడ పనిచేసినా విధి నిర్వహణలో ఆయన చూపించే అంకిత భావం, పనితీరులో ఏకాగ్రత వంటి లక్షణాలు ఉన్నత అధికారుల మన్ననలకు దారితీస్తూ స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాల్లో ప్రశంసాపత్రా లకు ఎంపిక చేస్తుండడం పరిపాటిగా మారింది. ఐ.టి.డి.ఎ. అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో కీలక పాత్ర వహిస్తున్న రాములు పనితీరును ప్రాజెక్టు అధికారి బాలాజి ప్రత్యేకంగా గుర్తించి గణతంత్ర దినోత్సవ సంబరాల్లో జిల్లా స్థాయిలో అవార్డుకు సిఫార్సు చేసారు. దీంతో గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వినయ్ చంద్ రాములుకు అవార్డును బహుకరించి విధి నిర్వహణలో ఆయన చూపుతున్న అంకితభావాన్ని అభినందించారు.
విశాఖ, శ్రీకాకుళం, విజయనరం జిల్లా కలెక్టర్లతో సమాచారశాఖ ఎపిఆర్ఓగా రాములు అవార్డులను అందుకున్నారు.
విధి నిర్వహణలో అంకిత భావం
విధినిర్వహాణలో ఆ శాఖాధికారులు చేసిన సూచనలు, ఆదేశాలను పాటిస్తూ సకాలంలో ఉన్నతాధికారులు వృత్తిపరంగా సూచించిన పనులను ఎంతో కమిట్మెంట్తో చేస్తూ ఉన్నతధికారుల వద్దే కాకుండా తాను పని చేసిన ప్రతీ జిల్లా కలెక్టర్ వద్ద అలాగే ఐటిడిఎ ప్రాజెక్టు అధికారుల వద్ద ప్రశంసలు అందుకుంటూ తన కెరీర్లో ఎటువంటి మచ్చలేకుండా పనిచేస్తూ శభాష్ రాములు అంటూ ఉన్నతాధికారులు మన్ననలు పొందుతూ విధులు నిర్వహిస్తున్నారు. పాడేరు సమాచారశాఖ డివిజనల్ పబ్లిక్ రిలేషన్ అధికారి రాములు ఎపిఆర్ ఒగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పనిచేస్తూ పలువురు మన్ననలు, ప్రశంశలు పొందుతూ వస్తున్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు పరిధిలో మూడు జిల్లాల్లో కూడా ఎపిఆర్ ఒగా పనిచేస్తూ ప్రభుత్వ పధకాలను, అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక పాత్రికేయులకు అందజేస్తూ తన వంతుగా ప్రభుత్వ పధకాలను పత్రికల్లో ప్రచారం చేసేలా కృషి చేస్తూ పి. రాములు విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అందరితో స్నేహాపూర్వకంగా ఉంటూ పిఒలు, జిల్లా కలెక్టర్ల వద్ద విధులు నిర్వహిస్తూ మన్ననలు పొందుతూ వస్తున్నారు. డివిజనల్ పిఆర్ఓ పి.రాములు సేవలను మొదటి సారిగా గుర్తిస్తూ 2002 సంవత్సరంలో పాడేరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన జి. వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ప్రశాంసా పత్రాన్ని అందుకున్నారు. 2006 సంవత్సరం 2007 సంవత్స రంలో వరుసగా రెండు సార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డును అప్పటి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఎ. శరత్ చేతుల మీదుగా రాములు అందుకున్నారు. పాడేరు నుంచి శ్రీకాకుళం బదిలీ అయిన రాములు 2008 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నాగులాపల్లి శ్రీకాంత్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మళ్లీ 2012 సంవత్సరంలో పాడేరుకు బదిలీ పై వచ్చి అప్పటి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి శ్రీకాంత్ ప్రభాకర్ చేతుల మీదుగా రాములు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 2014 సవంత్సరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐటిడిఎ పిఒగా ఉన్న ప్రస్తుత జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 2016 సంవత్సరంలో అప్పటి ఐటిడిఎ పిఒ ఎం, హరినారాయణన్
ఉత్తమ సేవా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2017 సంవత్సరంలో రాములు విజయనగరం బదిలీపై వెళ్లగా అక్కడ విధినిర్వాహాణలో ఉత్తమ సేవలు అందించడంతో 2018లో అక్కడ జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. మళ్లీ పాడేరు బదిలీ కావడంతో 2018 సంవత్సరంలో ఐటిడిఎ పిఒ డికె బాలాజీ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని రాములు అందుకున్నారు. 2020 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎపిఆర్ఒగా పి.రాములు సేవలను గుర్తించి విశాఖలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ చేతుల మీదుగా ఎపిఆర్ ఒగా రాములు ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 2022 గణతంత్ర దినోత్సవం, లో ,2023 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అప్పటి కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును అనుకున్నారు. రాములు సర్వీస్ కెరీర్లో మొత్తం 16 అవార్డులను స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అందుకుంటూ ఉన్నతధికారుల మన్ననలు పొందుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా పాడేరు డివిజనల్ పిఆర్ఓ రాములు మాట్లాడుతూ అవార్డు తీసుకున ప్రతీసారి బాధ్యతలు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా అంకిత భావంతో పనిచేయాలని బావిస్తామన్నారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు చేయడానికి నిరంతరం శ్రమిస్తానన్నారు. వృత్తిని దైవంగా బావించి సమాచార శాఖ ప్రతిష్టను పెంచడానికి కృషి చేసి ప్రభుత్వ సంక్షే, అభివృద్ధి పధకాలను ప్రచారం చేస్తానని పిఆర్ ఒ పి. రాములు అన్నారు. ఈనెల 31వ తేదీన ఆయన పదవి విరమణ చేయనున్నారు.
0 Comments