నిరసన వ్యక్తం చేస్తున్న చింతపల్లి మండల సర్పంచులు
విజయవంతమైన సర్పంచుల చలో విజయవాడ కార్యక్రమం
విజయవాడలో పంచాయతీ కమిషనర్‌తో భేటీ
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 5 : (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్)15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో జాప్యంపై నిరసన తెలిపేందుకు చింతపల్లి మండలానికి చెందిన సర్పంచులు విజయవాడలో నిర్వహించిన 'చలో విజయవాడ' కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ.1121 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంచాయతీలకు జమ చేయకపోవడంపై రాష్ట్ర స్థాయి సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైకాపా మండల అధ్యక్షుడు పాంగి గణబాబు నేతృత్వంలో చింతపల్లి మండలం నుంచి పలువురు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పంచాయతీ కమిషనర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. నిధులు విడుదల కాకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని, తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్‌ను కోరారు. దీనిపై స్పందించిన పంచాయతీ కమిషనర్, 15వ ఆర్థిక సంఘం నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయడానికి కృషి చేస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మంగుల, బలపం, పెద్ద బరడ సర్పంచులు సలమితి లక్ష్మయ్య, కొర్ర రమేష్ నాయుడు, సమిడి గోపాల్, కొత్తపాలెం ఉప సర్పంచ్ పాంగి మోహన్ రావు, వైకాపా మండల ప్రధాన కార్యదర్శి వనగల బెన్నిబాబు, లంబసింగి మాజీ సర్పంచ్ కోర్రా రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments