మాకవరపాలెంలో పెట్ల ఉమా శంకర్ గణేష్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేసిన ఎంపీటీసీ సర్వం..

నర్సీపట్నం, మే 5 ( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) : నర్సీపట్నం నియోజకవర్గం పరిధి మాకవరపాలెం మండల కేంద్రంలో ఎంపిటిసి సభ్యుడు రుత్తల సర్వం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నీ గెలిపించాలని, ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్వం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. ఏ గృహాన్ని పలకరించిన మా ఓటు వైసీపీకే అంటూ ఆప్యాయంగా చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే గణేష్ 30 వేల ఓట్ల  మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Post a Comment

0 Comments