చింతపల్లి మండల 10 టాపర్ లు యశ్వంత్ నాయుడు, టీజ అన్షిత

చింతపల్లి ఏప్రిల్ 22( వి ఎస్ జే ఆనంద్) : చింతపల్లి మండలం పదో తరగతి ఫలితాల్లో స్థానిక సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. జామి దుర్గ వెంకట యశ్వంత్ నాయుడు  558, వంతల టీజ అన్షిత 557 మార్కులు సాధించారు. యశ్వంత్ చింతపల్లి మండల కేంద్రానికి చెందిన దేవుడు అనే డ్రైవర్ కుమారుడు. టీజ అన్షిత గూడెం కొత్త వీధి మండలం పెదవలస పంచాయతీ చాపరాతి పాలెం గ్రామానికి చెందిన వంతల విజయరాజు( కోర్టు ఉద్యోగి) వసుపరి స్వరూప ( టీచర్) కుమార్తె. సెయింట్ ఆన్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పై ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా విలేకరులతో మండల టాపర్లు మాట్లాడుతూ తాము ఐఐటి ఇంజనీర్ గా రాణించాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

Post a Comment

0 Comments