రామారాయుడుపాలెంలో టిడిపి కి షాక్.... ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో వైసీపీలో చేరిన 20 కుటుంబాలు

నర్సీపట్నం మార్చి 26( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) : నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం లో టిడిపికి కంచుకోట గానున్న బూరుగుపాలెం పంచాయతీ శివారు రామారాయుడుపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ గ్రామం లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత వస్తున్నది. మంగళవారం నర్సిపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో మాకవరపాలెం మండల పరిషత్ అధ్యక్షుడు రుత్తల సత్యనారాయణ , మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రుత్తల వాసు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments