చింతపల్లి, మార్చి 25: (విఎస్ జయానంద్) ముత్యాలమ్మ జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడుగా పసుపులేటి వినాయకరావు ఎన్నికయ్యారు. సోమవారం అమ్మవారి ఆలయంలో జరిగిన గ్రామ సభలో వివిధ వర్గాల సభ్యులు అధ్యక్షుడుతోపాటూ ప్రధాన కార్యదర్శిగా పెదిరెడ్ల బేతాళుడు, కోశాధికారిగా గసాడి పద్మనాభంనీ ఎన్నుకున్నారు. పూర్తి కమిటీని నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నెల 28తేదీన నియమించుకొనేందుకు తీర్మాణించారు. ఈసందర్భంగా నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి సహకారంతో జాత రను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
0 Comments