మే 5 నుంచి 8 వరకు చింతపల్లి ముత్యాలమ్మ జాతర

చింతపల్లి, మార్చి 25:( విఎస్ జయానంద్) ముత్యాలమ్మ జాతర మే 5 నుంచి 8 వరకు నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. సోమవారం ముత్యాలమ్మ జాతర నిర్వాహణ ఏర్పాట్లుపై గ్రామ సభ జరిగింది. ఆలయ అర్చకులు సుర్ల అప్పారావు, గ్రామ పెద్దలు ఈఏడాది గంధామవాస్య మే 8తేదీన వచ్చిందని, గంధామవాస్యకు ముందు జాతర నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈమేరకు గ్రామ పెద్దలందరూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర తేదీలను ప్రకటించారు. జాతర ప్రతీ ఏడాది మాదిరిగా నాలుగు రోజుల పాటు నిర్వహించాలని తీర్మాణించారు. గ్రామపె ద్దలు, వివిధ వర్గాల సభ్యులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించాలని గ్రామ సభలో సభ్యులు చర్చించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనుషదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, జీసీసీ ఉద్యోగుల సంఘం నాయకులు దురియా హేమంత్ కుమార్, బీఏ రాజు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు బౌడు గంగరాజు, దేపూరి శశి కుమార్, యూవీ గిరి, కుడుముల వెంకట రమణ, గసాడి పద్మనాభం, వర్తకసంఘం ప్రధాన కార్యదర్శి, నాయకులు పెదిరెడ్డి బేతాళుడు, తాటిపాకల రమేశ్, సుర్ల వీరేంద్ర, హెచ్ డబ్ల్యూవో పసుపులేటి వినాయకరావు, వైసీపీ సీనియర్ నాయకుడు జల్లి సుధాకర్, మండలాధ్యక్షుడు మోరి రవి పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments