వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్నదని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరోసారి నేనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నానని వైయస్సార్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. 30 వేలకు పైగా మెజార్టీతో తాను గెలవబోతున్నానని చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతున్నదని, మరో 40 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరునున్నాయని వెల్లడించారు. 40 ఏళ్ల అయ్యన్నపాత్రుడు పాలన చూశారని, గత ఐదు ఏళ్లలో తన పరిపాలన చూసారని, ప్రజలు మార్పు చెందారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో నర్సీపట్నం మండలంలోని చెట్టు పల్లి, మాకవరపాలెం మండలం కొత్తపాలెం, నర్సీపట్నం మండలంలోని అమలాపురం పంచాయతీ ఉప్పరగూడెం, గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు, ఆదివారం నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సమక్షంలో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.చెట్టుపల్లి, కొత్తపాలెం గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ,వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి తాను తగిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సీపట్నం మండల పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ, మాకవరపాలెం మండల పార్టీ అధ్యక్షుడు వాసు, అమలాపురం సర్పంచ్ శెట్టి శ్రీను, నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ ,టౌన్ వైఎస్ఆర్ అధ్యక్షుడు ఏక శివ ,జగనన్న సచివాలయాల కన్వర్ తమరాన శ్రీ, మాకవరపాలెం ఎంపిపి రుత్తల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
0 Comments