మరోసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్

*ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా
*మేనిఫెస్టో పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజలను దగా చేస్తుంది..
నర్సీపట్నం, మార్చి 27( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) : నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదిస్తూ మరో అవకాశం కల్పించాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. బుధవారం
నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గడప ముందుకే వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు నీరాజనాల పలికారు. గడిచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను నూటికి 99 శాతం అమలు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పూర్తిస్థాయిలో అమలు చేయడం వల్ల, పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని చెప్పారు. ప్రజలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రగతి సాధించడం ద్వారా, రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దోహద పడిందని వివరించారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న 600 హామీలలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని, ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు కోట్ల రూపాయలు బకాయి పడిందని, ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరిగేదన్నారు .అలా కాకుండా ప్రజలను మోసం చేశారని వివరించారు. ప్రజలను మేనిఫెస్టో పేరుతో దగా చేసిన తెలుగుదేశం పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే గణేష్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
 అంతకుముందు అమలాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తల పలువురు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సర్పంచ్ శెట్టి శ్రీను, నర్సీపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలు రాజేశ్వరి, నర్సీపట్నం మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, వేములపూడి ఎంపిటిసి బోలెం వెంకటేష్, గురందరపాలం సర్పంచ్ చినబాబు, ధర్మసాగరం సర్పంచ్ కన్నయ్య నాయుడు, ఓ ఎల్ పురం సర్పంచ్ బంటు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments