చింతపల్లి(విఎస్ జె ఆనంద్) మార్చి 22: అమ్మ మీ వెంటే మేమంతా.. వైసీపీ విజయానికి మీతో కలిసి నడుస్తాం.. మీ సూచనలు సలహాలతో వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామంటూ చింతపల్లి, జికే వీధి వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎదుట స్పష్టం చేశారు. నూతనంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టిన భాగ్యలక్ష్మిని గురువారం చింతపల్లి, జీకే వీధి ప్రజా ప్రతినిధులు కలిశారు. ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు రాజకీయాలపై ఎమ్మెల్యేతో ప్రజాప్రతినిధులు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. కొంతమంది ప్రజా ప్రతినిధులు నాయకులు పార్టీ అధిష్టానం పాడేరు టికెట్ కేటాయించినందున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అభ్యర్థించారు. దీనికి భాగ్యలక్ష్మి తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. జగనన్న, వైసీపీ పార్టీని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ అధిష్టానం ఏ పదవి ఇస్తే ఆ పదవిలో ఒదిగి పోవడానికి ప్రజాసేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పాడేరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందున తనకు ఎటువంటి బాధ లేదని తెలియజేశారు. జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, తన అభిమానులుగా, వైసిపి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్న మీరందరూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునేందుకు అహర్నిశలు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. దీంతో ప్రజాప్రతినిధులు, నాయకులు మీ వెంట పార్టీ అభివృద్ధి, పార్టీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మీ సలహాలు సూచనలతో క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తామని భాగ్యలక్ష్మి కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జికే విధి ఎంపీపీలు కోరాబు అనూష దేవి, బోయిన కుమారి, చింతపల్లి వైసీపీ మండల అధ్యక్షుడు మోరీ రవి, చింతపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, ఎంపీటీసీ సభ్యులు ధార లక్ష్మీ పద్మ, లోవరాజు, మీనా, జయలక్ష్మి, వైస్ ఎంపీపీ గోపి నాయక్ శారద పాల్గొన్నారు.
0 Comments