ఆంధ్ర పర్యటన కొత్త అనుభవం: ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారుల బృందం

*గిరిజనుల ఆచారాలు కట్టుబాట్లు విభిన్నం

*లంబసింగి ప్రకృతి అందాలు అదుర్స్

*కాఫీ సాగును ప్రోత్సహిస్తున్న ఐటీడీఏ సేవలు బాగున్నాయి

*ఈఎంఆర్ విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

*ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారుల బృందం

ఈఎంఆర్  పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు, అధికారులతో తో ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారుల బృందం 
అమరావతి, ఆగస్ట్ 31( ఆనంద్- స్పెషల్ కరస్పాండెంట్, 9440304348): ఆంధ్ర పర్యటన ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చిందని ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారుల బృందం తెలిపింది. శిక్షణలోనున్న ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు గిరిజన ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు ఈనెల 26వ తేదీన ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి కి చేరుకున్నారు. 14 మంది సభ్యులు కలిగిన ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఏడుగురు సభ్యులు చొప్పున  గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. 
                                    విద్యార్థులతో ట్రైనీ అధికారులు
ట్రైనీలకు నృత్యం తో స్వాగతం పలుకుతున్న పలుకుతున్న విద్యార్థులు
ఒక బృందం గూడెం కొత్త వీధి మండలం దుప్పులు వాడ గ్రామం పరిసర ప్రాంతాలను, మరో బృందం చింతపల్లి మండలం తాజంగి  పరిసర ప్రాంతాల్లో ఆరు రోజులు పాటు పర్యటించారు. గిరిజనులతో మమేకమయ్యారు. విద్యార్థులకు అందుతున్న విద్య బోధన, ఆదివాసీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు చింతపల్లిలో పర్యటించారు. 
ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులకు కాఫీ సాగు వివరాలు తెలియజేస్తున్న ఏడి అశోక్
            ఎకో పల్పింగ్ యూనిట్ ని పరిశీలిస్తున్న ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు
ఐటీడీఏ నిర్వహణలోనున్న ఎకో  కాఫీ పల్పింగ్ యూనిట్ ని సందర్శించారు. ఐటిడిఏ కాఫీ ప్రాజెక్ట్ ఏడి జి. అశోక్ ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులకు కాఫీ సాగు, పండ్ల సేకరణ పల్పింగ్, క్లీన్ కాఫీ తయారీ, మార్కెటింగ్, రైతులకు అందిస్తున్న గరిష్ట ధరల వివరాలను తెలియజేశారు. దీంతో ట్రైనీ  సివిల్ సర్వీస్ అధికారులు గిరిజనులకు అధిక ఆదాయం సమకూర్చిస్తున్న కాఫీ సాగు కి ఐటిడిఏ అందిస్తున్న ప్రోత్సాహం బాగుందని కొనియాడారు. అనంతరం చిన్నగెడ్డ  కాఫీ తోటలు, చింతపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు, గ్రామ సచివాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను ఎంపీడీవో పి.ఆశాజ్యోతి వివరించారు.
ఎకో పల్పింగ్ యూనిట్ వద్ద ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు, అధికారులు 
విద్యార్థులతో కలిసి డాన్స్ చేసిన ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు.. 
పర్యటనలో  భాగంగా గురువారం సాయంత్రం ఏకలవ్య ఆదర్శ పాఠశాలను ట్రైనీ  సివిల్ సర్వీస్ అధికారులు సందర్శించారు. ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులను పాఠశాల విద్యార్థినిలు నృత్య ప్రదర్శనతో ఘనంగా స్వాగతం పలికారు. ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులకు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, అందుబాటులో ఉన్న సదుపాయాలను ప్రిన్సిపల్ అన్నామణి వివరించారు. 
విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ట్రైనీ అధికారి 
                                  విద్యార్థులతో ట్రైనీ అధికారులు 
ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నృత్య ప్రదర్శనలు అత్యద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఆదివాసీల సాంప్రదాయ నృత్యం అయిన ధింసాను ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు విద్యార్థులతో కలిసి చేశారు. ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగాట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు మాట్లాడుతూ ఆంధ్ర పర్యటన తమ ఎంతగానో నచ్చిందన్నారు. ఆంధ్ర కశ్మీర్ లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. గిరిజనుల ఆచారాలు కట్టుబాట్లు విభిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఈఎంఆర్ విద్యార్థుల ప్రతిభ మంచిగా ఉందని, విద్యలో  రాణించి ఉన్నత ఉద్యోగాలను అధిరోహించాలని ఆశ భావం వ్యక్తం చేశారు. 
    విద్యార్థులతో ధింసా నృత్యం చేస్తున్న ట్రైనీ అధికారులు 

ఈ పర్యటనలో ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు సిద్దార్ద్ జైన్, వీరేంద్ర కుమార్, అంకుర్ త్రిపాఠి,శృతి , రోహిత్ కర్థం , సాక్షం ,ఉట్కార్స్ , శిశిర్ కేఆర్ సింగ్, అంలాన్ సాహూ, బజ్రంగ్ ప్రసాద్ , కౌశిక్ మంగెరా , డాక్టర్ అనిల్ పాటిల్ , శృతి, కస్తూరి పాండా వున్నారు. ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులతో కాఫీ ప్రాజెక్టు ఎడి అశోక్, ఎంపిడిఓ ఆశాజ్యోతి , ఏటిడబ్ల్యూఓ జయ నాగ లక్ష్మి , ఈవోఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి గోవింద్, జూనియర్ అసిస్టెంట్ మురళి కృష్ణ పాల్గొన్నారు . 






Post a Comment

0 Comments