చింతపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ జి. రమ్య ఉత్తమ సేవా పురస్కారాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. గురువారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. చింతపల్లి ప్రాజెక్ట్ సిడిపిఓగా పనిచేస్తున్న రమ్య అంకితభావంతో, అందుబాటులో ఉంటూ అంగన్వాడి కేంద్రాలను పటిష్టం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. దిగువ స్థాయి ఉద్యోగులు పూర్తిస్థాయిలో లేకపోయినా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఉత్తమ సేవలు అందిస్తూ ఐసిడిఎస్ అధికారులు, గిరిజనుల మన్ననలు పొందుతున్నారు. ఆమె సేవలను గుర్తించిన జిల్లా అధికారులు ఉత్తమ సిడిపిఓ గా ఎంపిక చేశారు. ఈ మేరకు కలెక్టర్ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు.
0 Comments