చింతపల్లి( వి.ఎస్.జె.ఆనంద్) డిసెంబర్ 25:
చింతపల్లి సబ్ డివిజన్ కేంద్రం అంతర్ల నిస్సి ప్రార్ధన మందిరంలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆదివారం క్రిస్మస్ ని పురస్కరించుకొని నిస్సి ప్రార్ధన మందిరంలో పండుగను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిస్సి ప్రార్ధన మందిరం పాస్టర్ జాన్ క్రీస్తు జన్మ విధానంపై వాక్యోపదేశం చేశారు. క్రీస్తు నేర్పిన ప్రేమను పేద ప్రజలకు పెంచాలని, సాటి అయిన సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం పాస్టర్ జాన్ దంపతులు చింతపల్లి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులకు నూతన దుస్తులను పంపిణీ చేశారు.
అనంతరం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రేమ విందుని ఆచరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మత్సల మత్స్యరాజు సంఘ పెద్దలు దొండ రాజులు, నాగరాజు, ఉపాధ్యాయులు స్వామి, షారోన్ టీం ప్రతినిధులు అర్జున్, హేమంత్ కుమార్, టీవీ9 విలేకరి వన రాజు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేఖరి విజె దయానంద్ పాల్గొన్నారు.
0 Comments