2024 కు గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలి..ప్రతి ఒక్కరూ సన్నాదం కావాలి:పాడేరు, అరకు ఇన్చార్జిలు గిడ్డి ఈశ్వరి కిడారి,శ్రావణ్ కుమార్

ఇదేం కర్మ రా బాబు ఆంధ్ర రాష్ట్రానికి
పాడేరు(వీ.డేవిడ్):
వైసీపీ పాలనతో రాష్ట్రానికి ఇదేం కర్మ రా.. బాబు .. అని పాడేరు అరకు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిలు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం పాడేరు మండలం కుమ్మరి పుట్టు వద్ద నిర్వహించిన "ఇదేం కర్మ రాష్ట్రానికి" "ఆర్టిఎస్ శిక్షణ" తరగతి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియపరచి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఆయన వెళ్లి క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జిలు సేవా మిత్రాలు బూత్ కన్వీనర్లు క్షేత్రస్థాయిలో వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ కానీ చేర్పులు మార్పులు చేసి నూతన ఓటర్స్ నమోదు ప్రక్రియ సోషల్ మీడియాను పబ్లిసిటీ ఆర్ టి ఎస్ శిక్షణ తరగతిలో చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు నయ వంచన లేకుండా పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని, సభ్యతల నమోదు వేగవంతం చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ రేపు 2024లో చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేంతవరకు కష్టపడి పని చేయాలని అన్నారు. 
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని మీరు చేస్తున్నటువంటి కష్టానికి ఫలితం తో పాటు తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ టి ఎస్ బృందం గడిసుల రంజిత్, నారాయణరావు, శ్రీరామ కృష్ణ, టి.సత్తిబాబు, అరకు నియోజకవర్గ ఇంచార్జి కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు సివేరి అబ్రహం, పాడేరు నియోజకవర్గ అబ్జర్వర్ , రాజమండ్రి నారాయణరావు, అరకు పార్లమెంట్ అబ్జర్వర్ భాస్కరరావు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు పొలుపర్తి గోవిందరావు, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సోమేలి, చిట్టిబాబు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకటసురేష్ కుమార్ ఐదు మండలాల అధ్యక్షులు క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జిలు బూత్ కన్వీనర్లు సేవా మిత్రులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments