నేటి నుండి టిడిపి రిలే నిరాహార దీక్షలు: నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు:(వి డేవిడ్) పాడేరు నియోజకవర్గం లో  ఐదు రోజులపాటు రిలే నిరాహార దీక్ష లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపడుతున్నట్టు  మాజీ ఎమ్మెల్యే  గిడ్డి ఈశ్వరి తెలిపారు . బుధవారం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో  ఓల్డ్ బస్టాండ్ వద్ద ఐదు రోజులపాటు మండల టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి దీక్ష చేయనున్నామని  ఆమె తెలిపారు.  ఈనెల 28 తేదీ బుధవారం, జి మాడుగుల, 29న గురువారం కొయ్యురు, 30న శుక్రవారం జీకే వీధిలోనూ అక్టోబర్ 1న( శనివారం) చింతపల్లి,2న (ఆదివారం) పాడేరు నియోజకవర్గం కేంద్రంలో మండల సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు , కార్యకర్తలు అభిమానులతో కలిసి దీక్ష చేయనున్నామని తెలిపారు. ప్రతి మండల అధ్యక్షులు మీకు తెలిపిన తేదీల వారిగా  పాడేరు నియోజకవర్గం పరిధిలో జరుగు ఐదు రోజుల రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయాలన్నారు.  ప్రతి ఒక్క టిడిపి సీనియర్ నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా నాయకులు, ప్రతి ఒక్క టిడిపి కార్యకర్త లు పాల్గోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments