అరకువ్యాలీ :బిజెపి పార్టీ .వైసిపి పార్టీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచి పెంట శాంతకుమారి డిమాండ్ చేశారు. సోమవారం అరకు వ్యాలీ మండలం గన్నెల పంచాయతీ రామకృష్ణ నగరం జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పాచి పెంట శాంత కుమారి మాట్లాడుతూ .. బిజెపి కేంద్రంలో అధికారంలో వస్తే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు నిరుద్యోగులు కల్పిస్తామన్నారు . ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదన్నారు. అదేవిధంగా ప్రతి జన్ ధన్ ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానని ఇచ్చిన హామీని మర్చిపోయారు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ప్రతి జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. నిరుద్యోగులకు ఇప్పటివరకు ఉద్యోగులు కల్పించకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకో లేదన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఈ హామీని కూడా నెరవేర్చ లేదన్నారు. ప్రస్తుతము గిరిజనులకు ఈ రెండు పార్టీల వల్ల న్యాయం జరగటం లేదన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న జూడో యాత్రకు ప్రజలు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయి మోహన్ రావు, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోర్ర పోతురాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపరంగి వెంకటబాబు, జన్ని జగనాదం, జన్ని, మధు, జాన్ని వసంత కుమార్, నారాజీ రాజు, వంతాల సంజీవ్ కుమార్, తేడబారికి భీమారావు, మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments