సాగర తీరాన ఉన్న అందమైన విశాఖపట్నం కి ఏమైంది..? కేంద్ర ప్రభుత్వ తాజా హెచ్చరికలతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ముప్పు వున్న ప్రాంతాల జాబితాలో విశాఖపట్నం చేరింది. జిల్లాను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా హాట్‌స్పాట్ కేంద్రంగా గుర్తించింది. దేశంలో ఇప్పటికే 20 హాట్‌స్పాట్‌లను గుర్తించగా, తాజాగా సవరించిన జాబితాలో విశాఖను కూడా చేర్చింది. ఇక్కడ పెరుగుతున్న కరోనా కేసులే అందుకు ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నాటికి 266 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ చేతులు బయటపడ్డ ప్రాంతాల్లో కొత్తవారు వెళ్లకుండా నిరోధిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని విస్తృతంగా పిచికారీ చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల వరకు కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి, ఇంటింటికీ ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలను పంపించి, వ్యాధి లక్షణాలు ఎవరికైనా వున్నాయోమేనని సర్వే చేయిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. ఎవరికైనా వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలోషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో 78 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటుచేసి, వాటిలో 5,010 పడకలు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో రైల్వే ఆస్పత్రి, గాజువాక వికాస్ కాలేజీ, భీమిలి, ఎలమంచిలి, నర్సీపట్నం ఆస్పత్రుల్లో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రాలలో 138 మందిని చేర్చారు. వీరికి అన్నిరకాల సౌకర్యాలు సమకూర్చి, 14 రోజుల వరకు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో పలు ఆసుపత్రుల్లో 200 మంది ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నారు. మరో రెండు రోజుల్లో కేసులు సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది . విశాఖపట్నం సాధారణ స్థాయికి ఎప్పుడు చేరుకుంటుందా అనే వైద్యులు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ , విశాఖపట్నంలో అప్పుడే జనసంచారం నికి అనుమతులు వచ్చే అవకాశం కనిపించడం లేదు . దీంతో గిరిజన , గ్రామీణ ప్రాంత ప్రాంతాల ప్రజలతో పాటు శ్రీకాకుళం , విజయనగరం, ఒడిస్సా ప్రాంత ప్రజలు కూడా మే నెలాఖరు వరకు విశాఖపట్నం ని సందర్శించే అవకాశం కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ సమన్వయం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే నేతప్ప కరోనా వైరస్ వ్యాప్తి సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు . ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే వరకు ప్రజలు లాక్ డౌన్ పాటించక తప్పదని అధికారులు అంటున్నారు.
0 Comments