మలేరియా సబ్ యూనిట్ అధికారి మరణం తీరనిలోటు.. అడిషనల్ డీఎం అండ్ హెచ్ వో లీలాప్రసాద్.


చింతపల్లి ఏప్రిల్ 14 (షేక్  కాశిమ్ వలీ): మన్యప్రాంతంలో మలేరియా నివారణకు శక్తివంచన లేకుండా పనిచేసి స్థానిక  ప్రజలు,అధికారులు  ప్రసంసలందుకున్న మలేరియా సబ్ యూనిట్ అధికారి సెగ్గే చిన్నబ్బాయి మరణం  తీరనిలోటని పాడేరు అడిషనల్ డీఎం  అండ్ హెచ్ వో లీలాప్రసాద్ అన్నారు. చింతపల్లి సామాజిక ఆసుపత్రిలో డిసిహెచ్ డాక్టర్ డి.  మహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ మన్యంలో  మలేరియా  నియంత్రించడంలో సెగ్గే చిన్నబ్బాయి చేసిన సేవలు మరువరానివన్నారు. క్లస్టర్ విధానం అమలులో ఉన్నప్పటి  నుంచి చింతపల్లి, జీ కే వీధి మండలాలలో మలేరియా వ్యాధి నివారణకై దోమలు మందు (మలాథియాన్) పిచికారి పనులు, ఫాగింగ్, దోమతెరల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టడం వలన మన్యంలో మలేరియా వ్యాధి తీవ్రత తగ్గిందన్నారు.  చిన్నబ్బాయి కృషి  ఫలితంగా మరణాలు కూడా అదుపులోకి వచ్చాయన్నారు.  ఆయన అకాల మరణం గిరిజనులను , వైద్య ఆరోగ్యశాఖను తీవ్ర  దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి, అదేవిధంగా ఆ కుటుంబానికి మనోస్తైర్యం కలగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments