కర్నూలు నగరంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మూడు రోజుల క్రితం నగరంలో ఓ ప్రముఖ వైద్యుడు కరోనాతో చనిపోవడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు... వారిని ఐసొలేషన్‌కు తరలించారు. మరోవైపు డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషెంట్లు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గత నెల 20 తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఆ డాక్టర్ దగ్గరకు వచ్చిన పేషెంట్ల జాబితాను అధికారులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంతవరకు డాక్టర్‌ను కలిసి పేషెంట్లను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
0 Comments