రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి:మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు


     ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తో        
      మాట్లాడుతున్న మాజీ మంత్రి బాలరాజు  

గూడెంకొత్తవీధి ఏప్రిల్ 3 :
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్యులు వైద్య సిబ్బంది రోగులకు  అన్ని వేళలా అందుబాటులో ఉండాలని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు సూచించారు. శుక్రవారం గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో పర్యటించిన మాజీమంత్రి కరోనా వ్యాప్తి నివారణ, లాక్ డౌన్  నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలకు నిత్యవసర సరుకులు ఏ స్థాయిలో అందుతున్నాయి.. అనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలు కరోనా వైరస్  వ్యాప్తి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలు, విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలందరూ కరోనా వైరస్ వ్యాధి నివారణకు అప్రమత్తంగా.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఇది అని అన్నారు. ప్రజలు సామాజిక, భౌతిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ కాలంలో గృహాల్లో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. నెలలో తొలిరోజే లబ్ధిదారులకు పింఛన్ అందించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ. 1000  ఆర్థిక సహాయాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా శనివారం నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . ప్రతి లబ్దిదారునికి ఆర్థిక సహాయం అందుతుందని, ఏ ఒకరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ వలంటీర్లు , వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు గ్రామస్థాయిలో ప్రజలు కరోనా వైరస్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరచాలి అన్నారు. ప్రతి ఒక్కరు అధికారులకు సూచనలు పాటించాలన్నారు.    

Post a Comment

0 Comments