సోమవారం అర్ధ రాత్రి డౌనూరులో విధులు నిర్వహిస్తున్న పోలీస్, ఇతర శాఖల సిబ్బంది
చింతపల్లి, ఏప్రిల్ 6: టైమ్ 11:00pm
నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారిపై నాలుగు రోజులు రాకపోకలకు పూర్తి స్థాయిలో నిషేదిస్తున్నట్టు పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ అత్యవసర ఉత్తరువులు జారీచేశారు. సోమవారం నర్సీపట్నం లో రెండు కరోనా వైరస్ పాజిటివ్ లు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో చింతపల్లి త్రిమన్ కమిటీ సభ్యులు ఎంపీడీఓ ప్రేమకర రావు, తహసీల్దార్ గోపాల కృష్ణ, ఎస్ఐ మహ్మద్ అలీ చింతపల్లి ఏఎస్ పి సతీష్ కుమార్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారిని పూర్తిగా బ్లాక్ చెయ్యాలని నిర్ణయించి నివేదికను పీఓ కి పంపించారు. ఈమేరకు ఐటిడిఏ పీఓ అత్యవసర ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 7తేదీ నుంచి 10తేదీ వరకు చింతపల్లి - నర్సీపట్నం, అలాగే పాడేరు-నర్సీపట్నం ప్రధాన రహదారుల్లో రాకపోకలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులతో డౌనూర్ లో చెక్ పోస్ట్ లో ఏ ఒకరిని చింతపల్లి ప్రాంతానికి నర్సీపట్నం నుంచి అనుమతించేది ఉండదు. వాహనాలు అన్ని నిలిపివేయడం జరుగుతుంది. కేవలం పాలు కి మాత్రమే మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
0 Comments