చింతపల్లి ఏప్రిల్ 8 (షేక్ కాశిమ్ వలీ): లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు రోడ్లమీదకొస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చింతపల్లి పోలీసు పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచానికి పొంచివున్న ప్రమాదాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్, స్వీయనియంత్రణ, 144 సెక్షన్ వంటి కఠిన నియమాలు అమలులో ఉన్నప్పటికీ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కూరగాయలు, నిత్యావసర సరుకుల విషయంలో ప్రజలకు కొంత సమయం (ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు) నిబంధనలతో కూడిన వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలోనూ సామాజిక దూరం పాటించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిన నేపధ్యంలో పోలీసు శాఖ మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో బాగంగా మైధాన ప్రాంతాల నుంచి రాకపోకలు చేయడాన్ని, సమయం మించి రోడ్లపై సంచరించడాన్ని, ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు శాఖ ప్రచారం చేస్తుంది.
0 Comments