చింతపల్లి ఏప్రిల్ 3 : విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు నుంచి వ్యక్తులు రారావాలనుకుంటే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి క్వారంటైన్ విభాగము వైద్యులు ధ్రువీకరించిన సర్టిఫికెట్ చెక్ పోస్ట్ లో చూపించాలని చింతపల్లి ఏ ఎస్ పి ఎస్.సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గిరిజన ప్రాంతానికి మైదాన ప్రాంతాల నుంచి ఇతరుల ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. చింతపల్లి సబ్ డివిజన్ ప్రాంతానికి పొరుగు జిల్లాలు , రాష్ట్రాలు,దేశాలు నుంచి ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా డౌనూరు, కృష్ణదేవిపేట అల్లూరి పార్కు వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం చెక్ పోస్టుల వద్ద ఇతర ప్రాంత వ్యక్తులను అనుమతించడం లేదన్నారు. ఎవరైనా పొరుగు జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు నుంచి చింతపల్లి సబ్ డివిజన్ ప్రాంతానికి రావాలని భావిస్తే ముందుగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి లో గల క్వారంటైన్ విభాగంలో తనిఖీ చేయించుకొని వైద్యాధికారి ధ్రువీకరించిన సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. వైద్యాధికారి జారీచేసిన ధ్రువ పత్రాన్ని లంబసింగి, డౌనూరు చెక్ పోస్టుల వద్ద తనిఖీ అధికారులకు చూపించి ఏజెన్సీకి రావచ్చును అని చెప్పారు.
0 Comments