పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వలంటీర్లకు నగదు సహాయం అందజేసిన వర్తక సంఘం నాయకులు


చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వలంటీర్లకు వర్తక సంఘం నగదు సహాయం  అందజేశారు. శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో  వర్తకసంఘం అధ్యక్ష, కార్యదర్శులు జోగేశ్వరరావు, పెద్దిరెడ్ల బేతాళుడు, నాయకులు ఎంపీడీవో  ప్రేమాకరరావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు రూ. పదివేలు, అదేవిధంగా గ్రామ వలంటీర్లకు రూ.ఆరు వేల  నగదును అందజేశారు. అలాగే  పంచాయతీ రికార్డు అసిస్టెంట్ రాజారావు,  పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఐదేసి కిలోల బియ్యం కూడా  అందజేశారు.ఈ కార్యక్రమాలలో ఈవో ఆర్ డి శ్రీనివాసరావు, వర్తకసంఘం నాయకులు  యు. రమేశ్, షేక్. సత్తార్, టీ. రమేష్. తదితరులు పాల్గొన్నారు.

అన్వేషణ

Post a Comment

0 Comments