చింతపల్లి ఏప్రిల్13 (షేక్ కాసిమ్ వలీ) : ప్రతినిత్యం ప్రజా సంక్షేమం కోరుతూ పనిచేసే పాత్రికేయుల సేవలు అభినందనీయమని మాజి మంత్రి వైసిపి నాయకుడు పసుపులేటి బాలరాజు ఆన్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులకు ఆయన శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త లాక్ డౌన్ లోనూ పాత్రికేయులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న తరుణంలోనూ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ , పంచాయతీ శాఖలతో పాటు పాత్రికేయులు తమవంతు పాత్ర పోషింస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుండడం ప్రశంసనీయమన్నారు. పాత్రికేయుల సేవలను ప్రతిఒక్కరు గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
0 Comments