చింతపల్లి మండల కేంద్రం కుమ్మరి వీధిలో అగ్నిప్రమాదానికి ఓ పూరిల్లు ఆహుతయ్యింది. వివరాల్లోకి వెళితే..కుమ్మరివీధిలో తేనెల ఇన్ స్పెక్టర్ దాకే రాజేశ్వరరావు గృహంలో అతని భార్య ఒక్కరే కొన్నేళ్లుగా నివాసం ఉంటుంది . బుధవారం మధ్యాహ్నం సుమారు నాలుగు గంటలకు ఆమె వంట చేస్తుండగా కొన్ని నిప్పురవ్వలు ఇంటి పై కప్పు గడ్డి పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. స్థానికులు, పోలీసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. గృహం పైకప్పు పూర్తిగా కాలిపోయింది.
0 Comments