చింతపల్లి ఏప్రిల్ 9 (షేక్ కాశిమ్ వలీ): పట్టణ కేంద్రం సాయిబాబా దేవాలయంలో నున్న సాధువులకు చింతపల్లి వర్తక సంఘం నాయకులు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పట్టణ కేంద్రంలో సుమారు 20 మంది సాధువులు కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో సాధువులకు ఆహార కొరత ఏర్పడింది. ప్రస్తుతం పూటగడవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధువుల పరిస్థితిని గుర్తించిన స్థానికులు కొంతమంది తమ గృహాలకు తీసుకుని వెళ్లి ఒక పూట భోజనం పెడుతున్నారు. కాగా సాధువుల పరిస్థితిని గుర్తించిన స్థానిక వర్తక సంఘం నాయకులు వారానికి సరిపడిన బియ్యం , కూరగాయలను సాధువులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోసంఘం అధ్యక్ష ,కార్యదర్శులు జోగేశ్వరరావు, పెడిరెడ్ల బేతాళుడు నాయకులు యూ.రమేష్, యమ్ నాగేశ్వరరావు, టీ. రమేష్. షేక్. సత్తార్ ఆలయ పూజారి నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.
0 Comments