అంబెడ్కర్ కాలనీలో ప్రజలకు మాస్క్ లు పంపిణీ చేసిన ఆర్ ఐ సత్యనారాయణ

చింతపల్లి, ఏప్రిల్ 7:
చింతపల్లి మండల కేంద్రం ఎస్ సి కాలనీ ప్రజలకు గూడెం కొత్తవీధి ఆర్ ఐ దుమంతి వీర వెంకట సత్యనారాయణ మాస్క్ లను 
పంపిణీ చేశారు రెండు వారాలుగా గూడెంకొత్తవీధి మండలం చెందిన ఆర్ఐ సత్యనారాయణ కరోనా వైరస్  వ్యాప్తి నివారణ కోసం చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలాల్లో గిరిజన గ్రామాల్లో మాస్క్ లను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం చింతపల్లి మండలం లోని ఎస్సీ కాలనీ ప్రజలకు మాస్క్ లను ఆయన పంపిణీ చేశారు. తాము మాస్కులు కొనుక్కునే ఆర్థిక పరిస్థితి లేదని, ఆర్ఐ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని కాలనీ ప్రజలు తెలిపారు. ఆర్ ఐ ని స్పూర్తిగా తీసుకొని పలువురు కరోనా వైరస్  వ్యాప్తి నివారణకు ముందుకు రావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.         

Post a Comment

0 Comments