చింతపల్లి ఏప్రిల్ 3:
విశాఖ ఏజెన్సీలో రేషన్ కార్డు లేని నిరుపేద ప్రజలకు అధికారులు ఉచిత రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదివాసి మహిళా సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాగి వెంకాయమ్మ, మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సేవ చంద్రకళ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సంఘం నాయకులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ .. రేషన్ కార్డు లేని నిరుపేద గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయము, ఉచిత సరుకులు అవుతున్నప్పటికీ రేషన్ కార్డు లేని ప్రజలు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. చింతపల్లి మండలంలో 20 కుటుంబాలు, కొయ్యూరు మండలంలో 11 కుటుంబాలకు రేషన్ కార్డు లేక ఉచిత నిత్యావసర సరుకులు అందలేదని ప్రజలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని తెలిపారు. చింతపల్లికి చెందిన పచ్చిపాల దేవి, అన్నపూర్ణ, సేవా చంద్రకళ , కందుల గాదే కూడా శాంతి, రామాలయం వీధి రాట చిన్న, కూడా మచ్చకొండ, పెరంబుదూరి లోవ కుమార్ , గుర్రం నాగసాయి, వజ్రపు భారతి, చల్లా లక్ష్మి , మోస లక్ష్మి,మర్రి సీత, సాడిపేట పాంగి శ్రీదేవి, సాయినగర్ కిలో గంగాభవాని, కిలో సత్యవతి ,రామోజీ తిరుపతి , శంకర్ , కిలో చెల్లాయమ్మ, హుకుంపేట కు చెందిన కొటారి పద్మ, కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీ శనివారం పాడు గ్రామానికి చెందిన గేమ్మెల రాజు బాబు, మర్రి మల్లేశ్వరరావు, మర్రి నూకరాజు, వంతల సింహాద్రి, పూర్ణ, దుప్పల సన్యాసిరావు, రమేష్ , తాంబేలు రామ్ , మరి వెంకీ, చంటి బాబు లకు రేషన్ కార్డు లేక ఉచిత సరుకులు అందలేదన్నారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, రెవెన్యూ, మండల పరిషత్ ఇతర శాఖల అధికారులు చొరవ తీసుకొని నిరుపేద ప్రజలకు ఈ ఆపత్కాలంలో ఉచిత సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
0 Comments