నిత్యావసర సరకుల పంపిణీ చేస్తున్న ఎంపీడీవో పాత్రికేయులు
చింతపల్లి, ఏప్రిల్ 6(షేక్. కాశిమ్ వలీ): పట్టణ పరిధిలో పని చేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య దినసరి కార్మికులకు చింతపల్లి ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయుల బృందం నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దేశంలో కట్టడి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం పాఠకులకు తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల నిరుపేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పేద దినచర్య కార్మికులకు తమ వంతు సహకారం అందించాలని ఏపీయూడబ్ల్యూజే నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాత్రికేయులు చోడిశెట్టి శ్రీనివాసరావు (జెమినీ శ్రీను), దేశెట్టి సత్యనారాయణ (సతీష్)లు వారి వ్యక్తిగత నిధులతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, శానిటైజర్లు, మాస్క్, గ్లౌజులను ఏపీయూడబ్ల్యూజే చింతపల్లి నాయకత్వానికి అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీవో ప్రేమాకరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి వనరాజు, ప్రింట్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు విజె దయానంద్, పాత్రికేయులు పారిశుద్ధ్యం పంచాయతీ కార్మికులకు నిత్యావసర సరుకులు బియ్యం, టమాట, బంగాళదుంప, ఉల్లిపాయలు,వంకాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాస్, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఈ కార్యక్రమం పాత్రికేయులు రవి, నాగేశ్వరరావు , వల్లి, సోమరాజు, గౌస్, కె. శ్రీనివాస రావు, కోటి పాల్గొన్నారు.
0 Comments