చింతపల్లి ఏప్రిల్ 2: మైదాన ప్రాంతాలు, పొరుగు జిల్లాల వ్యక్తులను గిరిజన ప్రాంతానికి అనుమతించవద్దని చింతపల్లి ఏ ఎస్ పి ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మన దేశంలో కరోనా వైరస్ నమోదులో ఏడో స్థానంలో ఉందన్నారు. ఏపీలో 111 కేసులు నమోదు కాగా అందులో విశాఖపట్నం జిల్లా లో 11 కేసులు నమోదు నమోదు అయ్యాయని అన్నారు . కరోనా వైరస్ గిరిజన ప్రాంతానికి కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. వైరస్ ఏజెన్సీకి అడుగు పెడితే చాలా ప్రమాదం జరుగుతుందని, ప్రజలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన క్లిష్ట సమయం ఇది అని అన్నారు. గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా మైదాన ప్రాంత ప్రజలు గాని, పొరుగు రాష్ట్రాల వ్యక్తులు, పొరుగు జిల్లాల వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు గాని, మండల స్థాయి అధికారులకు సమాచారం చేరవేయడంతో పాటు, చింతపల్లి వై టి సి ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలన్నారు. ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే పెను ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదన్నారు. ప్రజలందరూ గృహాల కే పరిమితం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
0 Comments