నిరుపేదలకు అన్నం పెట్టి ఆదుకున్న వెల్డింగ్ షాపు యజమాని రవి



చింతపల్లి, ఏప్రిల్ 6(షేక్. కాశిమ్ వలీ): పట్టణ కేంద్రంలో నిరుపేదలు యాచకులు సాధువులు పంచాయతీ కార్మికులకు స్థానిక వెల్డింగ్ షాప్ యజమాని శంకు రవి దంపతులు భోజనాలు ఏర్పాటు చేశారు.    అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్పది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. దీంతో లాక్ డౌన్ కారణంగా ఆకలితో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు భోజనాలు పెట్టాలని  వెల్డింగ్ షాప్ యజమాని శంకు రవి, సూర్య కుమారి దంపతులు, కుమారుడు ప్రవీణ్ కుమార్ తలచారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం రవి గృహంలో  సాధువులు,  యాచకులు, పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం చేశారు.  అలాగే ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ముగిసేంత వరకు తమకు భోజనం పెట్టే ఆదుకోవాలని సాధువులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments