పాడేరు ఏప్రిల్ 6:
రేషన్ కార్డు లేని నిరుపేద ఆదివాసీలకు బియ్యం నిత్యావసర సరుకులను గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అప్పలనర్స పంపిణీ చేశారు. సోమవారం పాడేరు మండలం చింతలవీధి గ్రామపంచాయతీ పరిధిలో రేషన్ కార్డు లేని గిరిజన మహిళలకు ఉచితంగా ఐదు కేజీల బియ్యం, కూరగాయలు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుందని, రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయకపోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ మేరకు రేషన్ కార్డు లేని కూలీలకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో 5 కేజీ ల బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ చేశామన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించి నగదు మొత్తం 3500 చొప్పున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, రేషన్ కార్డులు లేని వారికి మానవత్వం తో ప్రభుత్వం బియ్యం, నగదు ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.
0 Comments