(అన్వేషణ తెలుగు న్యూస్ స్పెషల్ కరస్పాండెంట్ ..ఆనంద్)April 5:
రాష్ట్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రతి ఒక్కరు గృహాల నుంచి బయటకు వచ్చి కరోనా వైరస్ కి ఎదురెళ్లి సేవలందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టే మన్నారు.. దేశ ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చారు. తాజాగా దేశ ప్రజల ఐక్యతను చాటుతూ, చీకటిలాంటి కరోనా వైరస్మహమ్మారి ని వెలుతురుతో తరిమి కొడదాం అంటూ నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను నిలిపివేసి క్యాండిల్స్ గాని ద్వీపాలు గాని తొమ్మిది నిమిషాల పాటు వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. దీనికి కూడా ప్రజలందరూ మద్దతు పలికిన పది శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇలా ఉండగా వాట్సాప్ , సోషల్ మీడియాలో లైట్లు, ఇతర గృహ పరికరాలు ఆఫ్ చేస్తే గ్రిడ్ ఫెయిల్యూర్ అవుతుందని ఈపీడీసీఎల్ ఇంజనీరింగ్ అధికారులు ప్రకటించినట్టుగా ఓ మెసేజ్ చక్కర్లు కొడుతుంది. ఇది వాస్తవమా కాదా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం ఉంది. విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తున్న ఏసీ విద్యుత్ నిల్వ చేసే అవకాశం లేదు. కేవలం డిసి కరెంట్ ని చిన్న చిన్న బ్యాటరీ లలో భద్రపరుచుకుని తిరిగి ఉపయోగించుకునే అవకాశం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వస్తున్న కరెంట్ ని మనం ఎప్పటికప్పుడు వినియోగించుకోవాల్సిన దే. వేసవికాలంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈ ఎల్ ఆర్) అంటూ ఈపీడీసీఎల్ అధికారులు పవర్ కట్ చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే..ఈ విధంగా ఎందుకు చేస్తుంటారు అంటే విద్యుత్ వినియోగం పెరిగి పోవడం వల్ల 52 హెడ్జ్ దాడి పోతుందని భావించిన ఇంజనీరింగ్ అధికారులు ఈ విధంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ వినియోగాన్ని సమతుల్యం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల గ్రూప్లో సాంకేతిక సమస్య ఏర్పడదు. భారతదేశంలో జరుగుతున్న విద్యుత్ సరఫరా 50 హెడ్జ్ , విద్యుత్ సరఫరా గ్రిడ్ నుంచి 52-48 హెడ్జ్ మధ్యలో సరఫరా జరగాలి. 52 మించి విద్యుత్ వినియోగం పెరిగి నా, 48 కి తక్కువగా విద్యుత్ వినియోగం జరిగిన గ్రిడ్ లో సాంకేతిక సమస్య వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ సరఫరాను నిలిపి వేయాలంటే ఉత్పత్తి కేంద్రాలను కూడా ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగా ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ చెప్పినట్టు లైట్లు ఆఫ్ చేసినా గ్రిడ్ పై ఎటువంటి ప్రభావం ఉండదని ఈపీడీసీఎల్ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు . ఎందుకంటే నరేంద్ర మోడీ లైట్ లు మాత్రమే నిలిపివేయండి అన్నారని, విద్యుత్ వినియోగాన్ని పూర్తిగా నిలిపి వేయాలని చెప్పలేదని అంటున్నారు . గృహాల్లో లైట్లు ఆఫ్ చేసినప్పటికీ ఫ్యాన్లు, ఫ్రిజ్ , ఏసిలు పనిచేస్తాయని, అలాగే ఆస్పత్రులు ఇతర ఎమర్జెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపి వేయడం ఉండదని, వీధి లైట్లు కూడా వెలుగుతూ ఉంటాయని కావున 48హెడ్జ్ కంటే తక్కువకు విద్యుత్ వినియోగం వెళ్లే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. కావున నిశ్చింతగా ప్రజలందరూ ప్రధానమంత్రి చెప్పినట్టు దీపాలను వెలిగించి దేశ ఐక్యతను చాటుదాం.
0 Comments