చింతపల్లి ఏప్రిల్ 13(షేక్ కాశిమ్ వలీ) : ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పాడేరు అడిషనల్ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ లీలా ప్రసాద్ అన్నారు. సోమవారం చింతపల్లి వచ్చిన ఆయన స్థానిక వైటీసీలో ఐటిడిఏ ఏర్పాటు చేసిన క్వారంటైన్, ఐసోలేసన్ వార్డులను సందర్శించారు. క్వారంటైన్ లోనున్న 16మందిని ఆయన పరామర్శించారు. వారికి అందుతున్న భోజనం, వసతి, వైద్య సదుపాయాలపై ఆరాతీశారు. అనంతరం రికార్డులు పరిశీలించి అక్కడ క్వారంటైన్ లోనున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించడమే కాకుండా శానిటేషన్ పక్కాగా అమలు చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. కరోనా పై ప్రజలకు పూర్తి అవగాహనా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రేమకర రావు, హెల్త్ అసిస్టెంట్ నెహ్రు, ఏఎన్ఎం కుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments