సబ్ యూనిట్ అధికారి చిన్నబ్బాయి అకాల మరణం వైద్య ఆరోగ్య శాఖ కు తీరనిలోటు.. కోరుకొండ పిహెచ్ సి వైద్యాధికారి సంతోష్



చింతపల్లి ఏప్రిల్ 12( షేక్ కాసిం వలీ) : చింతపల్లి  మలేరియా సబ్ యూనిట్ అధికారి సెగ్గె  చిన్నబ్బాయి అకాల మరణం వైద్య ఆరోగ్య శాఖ కు తీరని లోటని కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి  సంతోష్ కుమార్ అన్నారు. కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ఆదివారం చిన్నబ్బాయి హఠాన్మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు సంతాప సూచకంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  వైద్యాధికారి మాట్లాడుతూ మన్యప్రాంతంలో మలేరియా నివారణకు చిన్నబ్బాయి ఎనలేని సేవలందించారన్నారు. మలేరియా నివారణకు గిరిజన ప్రాంతంలో  ఇంటింటికి దోమల (మలాథియాన్) మందు పిచికారీ పనులు, అదే క్రమంలో దోమతెరల పంపిణీ వంటి కార్యక్రమాలతో మలేరియా నివారణకు అహర్నిశలు శ్రమించారన్నారు. చింతపల్లి సబ్  డివిజన్ ప్రాంతం లో  నేడు మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయంటే ఆయన  కృషి ఫలితమేనన్నారు. ఆయన హఠాన్మరణం మన్యం వైద్య ఆరోగ్య శాఖను దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు.  ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్స్ లు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments