సబ్ యూనిట్ ఆఫీసర్ (హెచ్ ఓ) సెగ్గె చిన్నబ్బాయి ఆకస్మిక మృతి


చింతపల్లి(అన్వేషణ) :
చింతపల్లి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్(హెచ్ ఓ) సెగ్గె చిన్నబ్బాయి ఆకస్మికంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం కొండవంచుల  యర్రబంద గ్రామానికి చెందిన చిన్నబ్బాయి సుమారు 18 ఏళ్ల కిందట ఎం పి హెచ్ డబ్ల్యూ (ఎమ్)గా  వైద్య ఆరోగ్య శాఖ లో చేరారు. ఎనిమిదేళ్ల కిందట హెచ్ వోగా పదోన్నతి పొంది చింతపల్లి మలేరియా సబ్ యూనిట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలం చింతపల్లి క్లస్టర్ లో పని చేశారు. ఆయన కుటుంబంతో చింతపల్లి సాయి నగర్ లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం చిన్నబ్బాయి యధావిధిగా వాకింగ్ కి వెళ్లి గృహానికి వచ్చాడు. తనకు కడుపులో మంటగా ఉందని గోరువెచ్చని నీళ్ళు తాగి గృహం లోపల పడుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని నిమిషాల్లోనే బయటకు వస్తూ  ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచాడు. ఆయన ఆకస్మిక మరణం ని కుటుంబ సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా చిన్నబ్బాయి మృతదేహాన్ని చింతపల్లి ఆస్పత్రి  నుంచి స్వగ్రామము యర్రబందకు తరలించిన కుటుంబ సభ్యులు లాక్ డౌన్ కారణంగా అదే రోజు సాయంత్రం ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది ఇలా ఉండగా దూరప్రాంతాల నుంచి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన  సహచర ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు లాక్ డౌన్ కారణంగా కడసారి చూపు కి కూడా  నోచుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం
కాగా  ఆయన అకాల మరణంపై  చింతపల్లి డిసిహెచ్ డాక్టర్  డి.మహేశ్వర  రావు, డాక్టర్ రఘురాం, సీనియర్ వైద్యాధికారి డాక్టర్ లీలా ప్రసాద్, విశాఖపట్నం ఏఎంవో మురళీమోహన్, సెవెన్ హిల్స్ వైద్యాధికారి డాక్టర్ సాల్మన్ రాజు, ఎంపీడీవో ప్రేమకర రావు,ఏపీ డి లు రవీంద్రనాథ్, భాగ్య రావు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  

Post a Comment

0 Comments