నిరుపేద గిరిజన కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన పాస్టర్ కాలేబు దంపతులు

చింతపల్లి (షేక్. కాశిమ్ వలీ): మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో నిరుపేద గిరిజన కుటుంబాలకు స్థానిక సాడీపేటకు చెందిన ఇమ్మాన్యుయేల్ క్రిష్టియన్ ప్రార్థనా మందిరం పాస్టర్ కాలేబు దంపతులు ఐదురకాల కూరగాయలను పంపిణీ చేశారు . శుక్ర, శనివారాల్లో సాడీపేట, ఇంద్రానగర్ కొత్తూరు, బుడతదలవేణం గ్రామాల్లో గిరిజనులకు ఐదు రకాల కూరగాయలు కిలో చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని బైబిల్ చెబుతుందని, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మా ప్రాంత గిరిజన కుటుంబాలకు తన వంతుగా సహాయం అందించామన్నారు.  గిరి గ్రామాల్లో వ్యవసాయ అటవీ ఉత్పత్తులు, కూలిపనులు చేసుకుంటే తప్ప పూటగడవనీ అమాయక గిరిజనులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ సభ్యులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments