గ్రామ చెక్ పోస్ట్ వల్ల రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు ఉద్యోగులు..

దారకొండ: చింతపల్లి- సీలేరు ప్రధాన రహదారి కొంగ పాకలు గ్రామం వద్ద స్థానికులు అనాలోచితంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ కారణంగా ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..కరుణ వైరస్ వ్యాప్తి నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  ప్రకటించాయి.  మైదాన ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతంలో అడుగుపెట్టకుండా గా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసి అధికారులతో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో గిరిజనులు గ్రామ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల వల్ల అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్  వెళ్లే పరిస్థితి లేదని తక్షణమే తొలగించాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి స్వయంగా ప్రకటించారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు పట్టించుకోవడం లేదు. సీలేరు-చింతపల్లి ప్రధాన రహదారిలో  కొండపాక గ్రామం వద్ద  స్థానికులు రహదారికి అడ్డంగా ఓ మద్ది చెట్టు ని నరికి వేసి గ్రామ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. కాగా బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళుతున్న వీఆర్ఏ, రెవెన్యూ ఉద్యోగి రహదారిపై  ఉన్న చెట్టుని రాత్రివేళ గుర్తించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు గాయపడ్డారు పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతంగా గ్రామ చెక్ పోస్ట్ ను తొలగిస్తే మంచిదని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Post a Comment

0 Comments