సేవ చేస్తూ మరణిస్తే కోటి రూపాయలను అందివ్వనున్న ప్రభుత్వం


న్యూఢిల్లీ : కరోనా వైరస్ సోకిన వారికి వైద్య సహాయం చేస్తూ మరణించిన వారికి కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ దాతృత్వాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా సోకిన వారికి వైద్య సహాయం అందిస్తూ మరణించిన వారికి కోటి రూపాయలను సాయంగా కేజ్రీవాల్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ జాబితా కిందికి వస్తారని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న భేదమేమీ లేదని, కరోనా సోకిన వారికి సేవ చేస్తూ పై రంగాల వారు ఎవరు మరణించినా వారికి ఈ సాయం లభిస్తుందని కేజ్రీవాల్ ప్రకటించారు.

Post a Comment

0 Comments