చింతపల్లి(షేక్ కాశిమ్ వలీ): పట్టణ వీధులు, పరిసర గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు చింతపల్లి పెద్ద పైపు యువత కూరగాయలను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచిన లాక్ డౌన్ వల్ల నిరుపేద కుటుంబ ప్రజలు నిత్యావసర సరుకులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ వంతుగా నిరుపేద కుటుంబాలకు కూరగాయలను ఉచితంగా అందజేయాలని భావించిన సుర్ల వీరేంద్ర కుమార్ పెద్ద పైపు యువతతో కలిసి కూరగాయలను సమకూర్చారు. ఒక్కొక్క కుటుంబానికి కూరగాయలు కిలో చొప్పున వంకాయలు, బంగాలదుంపలు, క్యాబేజీ, టమోటా, దొండకాయలు, కందిపప్పు, నీరుళ్ళి, పచ్చిమిర్చి ప్యాకెట్లను స్థానిక సీఐ సన్యాసినాయుడు చేతులమీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు .చింతపల్లి తో పాటు గడపరాయి, కందులగాదె , మల్లవరం తదితర గ్రామాల్లో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.
0 Comments