రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం:నర్సీపట్నం తహసిల్దార్ ఎం ఏ శ్రీనివాస్


అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న తహసిల్దార్ శ్రీనివాస్ 

నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్):
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయమని నర్సీపట్నం తహసిల్దార్  ఎంఏ  శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని తహసిల్దార్ , సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తహసిల్దార్  మాట్లాడుతూ భవిష్యత్ తరాల అవసరాలు, ప్రజల భద్రత, స్వేచ్ఛపై   ముందుగానే గుర్తించి  అంబేడ్కర్ ప్రపంచ దేశాలు కీర్తించే రాజ్యాంగాన్ని నిర్మించారు అన్నారు. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను భావితరాలకు ప్రతి ఒక్కరు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments