ఆదివాసీలకు అండగా తెలుగు యువత.. గిరిజనులకు బియ్యం, కూరగాయలు పంపిణీచేసిన టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవివి ప్రసాద్



చింతపల్లి(అన్వేషణ):
లాక్ డౌన్ కాలంలో ఆదివాసీలకు తెలుగు యువత అండగా నిలుస్తుంది. చింతపల్లి మండలం పెదబరడ  పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులకు టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎంవివి ప్రసాద్ వ్యక్తిగత నిధులతో నిరుపేద గిరిజనులకు బియ్యం, కూరగాయలు పంపిణీచేశారు. వివరాల్లోకి వెళితే.. శనివారం చింతపల్లి మండలం లో పర్యటించిన ప్రసాద్ ట్రాక్టర్ తో నిత్యావసర సరుకులు ఆయన వెంట తీసుకొచ్చారు.
 
చింతపల్లి టీడీపీ అధ్యక్షుడు బేర  సత్యనారాయణ పడాల్ సూచనా మేరకు పెదబరడ  పంచాయతీ పరిధి లో గల చింతలూరు, నరహర వీధి గ్రామాల్లో 600 గిరిజన  కుటుంబాలకు 5కిలోల బియ్యం, కిలో చొప్పున టమాటాలు, ఉల్లిపాయలు, బెండకాలు, వంకాయలు, బంగాళాదుంపలు, పావుకిలో పచ్చిమిర్చి పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు పంపిణీ  చేసిన ప్రసాద్ కి స్థానిక గిరిజనులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సరకపు రాజు, కిల్లో పూర్ణచందర్ పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments