చింతపల్లి ఏప్రిల్12 (షేక్ కాశిమ్ వలీ): కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో నిరుపేదలు, సాధువులు, యాచకులకు, దినసరి కార్మికులు అకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సాధువులు, యాచకులకు, దినసరి కార్మికులు అకలి తీర్చేందుకు క్రైస్తవ సోదరులు షరాన్ బృందం సభ్యులు ముందుకొచ్చారు. ఆదివారం ఈస్టర్ నీ పురస్కరించుకొని నిరుపేదలు, సాధువులు, యాచకులకు, దినసరి కార్మికులతో పాటు లాక్ డౌన్ అమలులో అహర్నిశలు శ్రమిస్తున్న పోలిసులు, పాత్రికేయులకు షారోన్ బృందం భోజనాలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో టివి9 రిపోర్టర్ వనారాజు, రిపోర్టర్ వై. ఆనందరాజు (గాంధీ), రుత్తల. సతీష్ (ఆర్జున్), హేమంత్, రవి , అప్పలరాజు, రాజు , ఆనంద్, నాగేష్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments